|
స్తారప... దయుండై శ్రీ
సూరేశ్వరదేవుపేర శోభితుండయ్యెన్.
| 2
|
చ. |
వెలయ నుమేశ్వరాయతనవిస్తర మొప్పంగం జేసి యందు నం
దులం దనరించి చిత్రవితతులు ప్రతిభ న్రచియింపంబంచి పే
శలముగ మంటపంబు విలసన్నతి[1] వ్రిత్తముగా నొనర్చ్చుటం
బొలుపుగం బ్రస్తుతింపం దగుం బోచయదామనిం గీర్త్తిధామునిన్.
| 3
|
సీ. |
ఈహితసిద్ధిగా నేగె సూరేశ్వర
దేవ(దే)వుని సుప్రతిష్ఠ సేసె
ఆదేవునకు భోగ మచ్చోట నిరువుట్టీ
యుత్తమక్షేత్రంబుం గ్రొత్తచెఱువు
వెనుకదక్షిణభాగమున రెండు మఱుతులుం
దగువ్రిత్తి యాచంద్రతారకముగం
గొమరైన లోహితగోత్రుండు దామనా
ర్య్యాత్మజుం డగుపోచనార్య్యు పుత్రుం
డంచితముగ దామనామాత్యుం డిచ్చె శ్రీ
గణపతిక్షితీశకార్య్యభరణ
భవ్యమూర్తి లెంకవంటి కోకునకు న
న్నయ్యకుం బుణ్యముగ జనస్తుతముగ.
| 4
|
62
(ఈశాసనము గుంటూరుమండలములో ఒంగోలుతాలూకాలోని చందలూరుగ్రామమందు రామలింగేశ్వరస్వామి యాలయము నెదుటనున్న ఱాతిమీఁద చెక్కఁబడియున్నది. Nellore Inscriptions Vol. 2. No. 238.)
- ↑ "విలసన్మతి" అని యుండవలయును.