Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(దీనిపిదప నొకపెద్దవచనము గలదు. అందు కాటయ 1157 వ శకసంవత్సరమునకు సరియైన “మన్మథసంవత్సరమాఘశుద్ధ 15 గురువారమునాండు పంచలింగాలకును పెంచరపల్లిని" దానము చేసినట్లున్నది.)

——————

60

శ. స. 1159

(ఈశాసనము గుంటూరుమండలమునందు కాజగ్రామములో అగస్త్యేశ్వరస్వామియాలయము తూర్పుగోడమీఁద చెక్కఁబడియున్నది.)

స్వస్తి సమధిగతపంచమహాశబ్ద మహాసామంత మహాసామం
తాధిపతి మహాప్రచండదండనాయక పదవిరాజమానులైన శ్రీమహా
(దం)డనాయక మల్లినాయకుండు తమతల్లి కొమరమదేవులకు ధర్మ్ము
వుంగాం గ్రాంజ ఐతీశ్వరమహాదేవరకు అఖండదీపానకుం బెట్టిన మేం
కలు 25।

(దీని తరువాతఁ గొన్నియక్షరములు భూమిలోఁ గప్పుపడిపోయినవి.)

సీ.

నుతనిధిశరరుద్రమితశకసమపుష్య
            సితవసుతిధి సూర్య్యసుతదినమున
మకరసంక్రమవేల సకలధరాధినా
            థుండగుచోడని దండనాథుం
డనఘుండు మల్లన దనమాత గొమరమాం
            బికకు ధర్మ్మువుగాంగం బ్రీతితోడ
కనకాద్రిధైర్య్యుం (డ)ఖంణ్డవర్త్తికి సప్త[1]
            వింశతిగొరుల[2] వెలయనిచ్చి

  1. "పంచ" అని యుండనోపు.
  2. "గొఱ్ఱెల" అని యుండనోపు.