Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

శ. స. 1080 (ప్రాంతము)

(ఇది గుంటూరుమండలములో సిరిపురముగ్రామమందు రామేశ్వరాలయమున నొకఱాతిమీఁద నున్నశాసనము చివరభాగము. శాసనకాలమును దెలుపు మొదటిభాగము పోయినది. Government Epigraphist's Collection No. 49 of 1909.)

చ.

ఇల వెలనాంట్టిచోడినృపు నిచ్చినదత్తము దీని కన్యథా
దలంచిన దుర్వ్వినీతుండు మ(దం)బ్బఱి దుర్ద్దశం జెంద్ది వంద్దియా
కులుండై[1] కాలుప్రోలు సొరం గొట్టిన విడ్మఱ గాన కంద్ద తా
నెలకొని రౌరవాంబుధి మునింగి యడంగు ననేకకాలములు.

1


చ.

చెఱువులు నూఱు వన్నస లచింత్యము సత్రము లగ్రహారములు
గుఱుకొని లక్షగంగు లొకకోటిశివాలయములు సహస్రకం
బఱువదివేలు వావులు సతాధ్వరములు[2] పదివేలు బ్రహ్మముం
బెఱిచిన(య)౦తవాతకము సిద్ధము దీనికి హింస సేసినన్.

2


క.

తనదత్త మన్యదత్తం
బనంజనదు స్వదత్త మెట్లట్ల[3] రక్షిం
పనియతం డఱువదివేలేం
డ్లనవరత మమేధ్యక్రిమి[4] యై జనియించ్చును.

3

—————

  1. కులుండయి
  2. బావులు శతాధ్వరములు
  3. మెట్టులట్టుల
  4. మవేధ్యము క్రిమి