Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

శ. స. 1030

(ఈశాసనము గుంటూరుమండలములో అమరావతీగ్రామమందు అమరేశ్వరస్వామియాలయమునందు పెద్దమండపము దక్షిణపుగోడలోఁ గట్టఁబడియున్న యొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 240.)

ఉ.

శ్రీరమణియ్యు ణ్డర్ద్ధిజనసేవ్యుణ్డు భవ్యుణ్ణు దివ్యమూర్త్తి శౌ
ర్య్యారభ(టీధుతా?)తినిశితాశివిదారితశత్రువర్గ్గుణ్డా
ధారితబన్ధుమిత్ర(జ)నతామణి గొంక్కనరేంద్రుమంత్రి(వ్రో)
త్సారితలోభమోహవ్రితసత్వుణ్డు (వ్రోలణ్డు) ధన్యు ణ్డున్నతిని.

1


క.

శ్రీరాజవ్రోలిశాసను
ణ్డారాధితనీలకణ్ఠు ణ్డ(భి)నవమదనా
కారుణ్డు వ్రోలణ్డు విబుధా
ధారుణ్డనం బొన్నరాంబతనయుణ్డు నెగడెను.

2


క.

ఆతనివల్లభి గొమ్మమ
మాతంగ్గమరాలయాన మనసిజురతివి
ఖ్యాతయశోనిధి గొంక్కమ
హీతలపతి కరుణ లక్ష్మి నెంత్తయు వెలసెను.

3


ఉ.

చారువిశుద్ధవంశదధిసాగ(ర)సంభవితేంద్దులేఖ ల
క్ష్మీరుచితాంగ్గ(భాతి) నుపమింప్ప సతీత్వగుణప్రసిద్ధిమెయి[1]
నారయ సెజ్జప్రోలనికులాంగన గొమ్మమ మేలు సీతకును
వారిజబన్ధుకాంత్తకును వాసవుకాంత్తకు లక్ష్మిదేవికిని.

4


ఉ.

అంబరమూర్త్త్విఖేందుమితమై సక[2]వత్సరములు సనంగ్గ భూ
మ్యంబుదివాకరాత్మ కల యంత్తకు భక్తి నఖణ్డమైన దీ

  1. మై
  2. శక