Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాయసం అయ్యపరుసయ్యవారు కొండవీటిసింహాసనము పాలించం
గాను ఆయనసేవకుండు చినబొమ్మనాయండు వీరేశ్వరుని ప్రాకారము
ఖమండపములు సమర్పించెను॥ ఆయన మఱది బాణాల వీరయ్య పద
కము సమర్పించెను॥

—————

79

శ. స. 1460

(ఈపద్యము గుంటూరుమండలములో కొండవీటికోట యుత్తరపు (కొండపల్లి)ద్వారము కుడివైపు గోడమీఁద చెక్కఁబడియున్నది. అచ్యుతదేవరాయలు శ. స. 1452 ప్రాంతమున రాజయ్యెను గావున నీశాసనము శ. స. 1460 ప్రాంతమునఁ బుట్టినదనవచ్చును.)

సీ.

నిర్మించ్చె నేమంత్రి నిరుపమప్రాకార
            నవకంబ్బుగా గోపినాథపురము
నిలిపినాం డేమంత్రి నియతవైభవముల
            గోపికావల్లభుం కూర్మి వెలయ[1]
పాలించ్చు నేమంత్రి ప్రకటధర్మఖ్యాతి
            మహిమ మీరంగ నంధ్రమండ్డలంబ్బు
గెలిచినాం డేమంత్రి లలితవిక్రమమునం
            బ్రబలుండై యవనులబలము నెల్ల
నతండు భూపాలమంత్రీంద్రసతతవినుత
ధీవిశారదుం డచ్యుతదేవరాయ
మాన్యహితవర్తనుండు శౌర్యమహితయశుండు
భానుతేజుండ్డు రామయభాస్కరుండ్డు.

1

—————

  1. గూర్మి వెలయ