శాసనపద్యమంజరి
1
(ఈశాసనము గుంటూరుమండలమునందు అద్దంకిగ్రామమున నొకపొలములో నున్నఱాతిమీఁద చెక్కఁబడియున్నది. శాసనము పైభాగము కొంతయు నడుగుభాగము కొంతయు శిథిల మైపోయినది. Epigraphia Indica Vol. XIX)
తరువోజ. |
పట్టంబుగట్టిన ప్రథమంబు నేణ్డు
బలగర్వ్వం బొప్పంగ బైలేచి[1] సేన
పట్టంబు గటిఞ్చి[2] ప్రభుబణ్డరంగు[3]
బఞ్చిన సమత్త[4] పడువతో బోయ
కొట్టంబు ల్వణ్డ్ఱెణ్ణు గొణి[5] వేంగినాణ్టిం
గొళల్చి[6] యాత్రిభువనాంకుశబణ[7] నిల్పి
కట్టెపుదుర్గ్గంబు గడు బయల్సేసి
కణ్డుకూ ర్బెజవాడ[8] గావిఞ్చె మెచ్చి.
పణ్డరంగు పరమమహేశ్వరుణ్డు ఆదిత్యభటారనికి[9] ఇచ్చినభూమి
యెనుబొదివుడ్ల ఆడ్లపట్టు[10] నేల దమ్మవురంబున దమ్మువులు వీని రక్షిఞ్చినవారికి
అస్వమేధంబున పలంబు[11] అగు.
|
|
- ↑ బొప్పంగం బై లేచి
- ↑ గట్టిఞ్చి
- ↑ ప్రభుం బణ్డరంగుం
- ↑ సామంత
- ↑ కొట్టము ల్పణ్డ్ఱెణ్డు గొని
- ↑ గొళచి
- ↑ త్రిభువనాంకుశమున
- ↑ కందుకూ ర్బెజవాడ
- ↑ భట్టారకునకు
- ↑ వుట్లఆళ్లపట్టు
- ↑ అశ్వమేధంబున ఫలంబు