జాహ్నవీయము నాదిసకళపావననదీ విమలతీర్ద్ధాంభఃపవిత్రితంబు సవిధదేశస్తాయి[1] శివమౌళిబాలేందు కౌముదీసంఫుల్లకైరవంబు బహుమహా రివాహపాథోభరధ్వాన ఘుమఘుమాయితదిశాగోళకంబు జలసారణీసేకసంవర్ధితానేక వనవినీతాధ్వగాధ్వశ్రమంబు బలవదురుమత్స్యకచ్ఛపడుళికుళీర తిమితిమింగిళవిక్రమక్రమవిహార తరళతరతుంగభంగకదంబచుంబి తాభ్రవీథి సంతానమహాపయోధి.
కపటసూకర మైనకైటభాసురవైరి ఖురపుటంబులం బరిక్షుణ్న మయ్యె రఘుకులోద్వహధనుర్యంత్రముక్తము లైన చిచ్చుఱముల వేండిం జేవదఱగెం[2] గుంభసంభవునిహస్తాంభోరుహంబున నాపోసనం బయి[3] హ్రాస మొందెం బాషాణములు నచ్ఛభల్లగోలాంగూల కపియూధములచేతం గట్టుపడియె వనధి యేభంగి సరివచ్చు ననంగవచ్చు సారసాతలగంభీరవారి యగుచు నపగతాపాయ మగుచు శోభాఢ్య మగుచు ననుపమం బైనసంతానవనధితోడ.