69
(ఇది కడపమండలమునందలి తాళ్ళప్రొద్దుటూరుగ్రామమందు ఆంజనేయస్వామి యాలయమునకుఁ దూర్పుగా నున్నఱాతిమీఁది శాసనము. శాసనకాలము చెప్పఁబడలేదు. లిపినిబట్టి శ.స. 1300 ప్రాంతముదని చెప్పవచ్చును)
చ. |
ఇల జగతాపిఖడ్గమున నీల్గినవీరు(ణి)[1] రంభ వుచ్చుకోం
దలంచినం దూర్ప్పుదిక్కున ఘ్రితాచి గిసుక్కునం దుమ్మె నంతలో
పలం జనుదెంచ్చె వా(ని)కులభామిని (ని)౦గిపథంబునందు ని
ష్ఫలతకు రంభయు న్వెలఱువాఱిన నవ్వి(రి) దోడికామినులు.
| 1
|
చ. |
గురుమరణోచితం బయినకోపమునం జమదజ్ఞిజుండు[2] ము
న్నిరువదియొక్కమాంటు ధరణీశునెల్లను జంపి యమ్మహా
పురుషుండు మర్త్యలోకమునం బుట్టి వధింపంగం బాపమంచు వి
స్తరముగం దాలె[3] గాక జగతాపి దలంచిన నాండ చంపడే.
| 2
|
సీ. |
తురగచ(ర్)మంబునం గరమొప్ప నెఱికింగాం
బసరించి దానన ముసుంగువెట్టి
తెలుపెక్కం గఱివోవ బుళగినవునుక మిం
చిన వెండికోరంగాం జేతంబట్టి
ఏనుక[4]తలలలో నెసగిన ముత్తియం
బులు గుంకుమాక్షతంబులుగం బోసి
వేతాళఢాకినీభూతంబులార మీ
కును ముంజికం బని కుడువంజెప్పి
|
|
- ↑ వీరుని
- ↑ గురుమరణోదితం బయిన కోపమునం జమదగ్నిజుండు
- ↑ దాళెం
- ↑ ఏనిక