పుట:విక్రమార్కచరిత్రము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

85


వ.

ఇవ్విధంబున నప్పరమేశ్వరుం బరితుష్టహృదయునిం గావించి, తదీయాయతనశిఖరమహోక్షధ్వజప్రదక్షిణపరిణద్దమహోత్సవసమయసమాగతభ్రమరరూపదివ్యసంయమిసముదయంబును నక్షీణపరమతపోధనప్రత్యక్షపరంజ్యోతిస్స్వరూపంబును నద్భుతాయత్తచిత్తుం డయి యవలోకించి, దక్షిణకైలాసం బనం బ్రశస్తి వహించిన కాళహస్తి మహాస్థానంబును, ననంతభోగికటకోత్కటకంబగు వేంకటాచలంబును, సర్వలోకలోచనసముక్సేధసౌధగోపురంబగు కాంచీపురంబును, ననవరతపరిస్ఫుటకావేరీసముత్సంగంబగు శ్రీరంగంబును, నక్షీణదురిశాక్షేపణప్రారంభధురీణంబగు కుంభఘోణంబును, శ్రీరామప్రతిష్టాభిరామంబగు రామేశ్వరంబును, జననిరీక్షణాపేతదుష్కర్మబంధంబగు సేతుబంధంబును, సందర్శనసంచలీకృతజగజ్జననయనంబగు ననంతశయనంబును జూచి, యక్షేశ్వరదిశాభిముఖుండై, మోక్షదానదీక్షాసమక్షంబగు విరూపాక్షంబునకుం జని.

217


శ్రీవిరూపాక్ష క్షేత్రప్రశంస

ఉ.

లోలతఁ గాంచె నాసుగుణలోలుఁడు, చారుశీలాగళజ్ఝరీ
జాలతటిప్రవాళఘనసత్తరువాటముఁ బార్శ్వతుంగభ
ద్రాలహరీవినోదవిహరజ్జలశీకరనిర్గతశ్రమో
ద్వేలహరప్రణామ మతిదీపితకూటము, హేమకూటమున్.

218


వ.

కని, యటఁ జని తదగ్రభాగంబున.

219


ఉ.

ఇక్షుధనుర్విపక్షుని, రవీందుకృతక్షుని, సర్వదేవతా
ధ్యక్షుని, నాదిభిక్షుని, హతప్రతిపక్షుఁ, గృతాంతదంతిహ
ర్యక్షు, మహాముముక్షుశరణాగతరక్షణదక్షు, [1]శ్రీవిరూ
పాక్షుని, నానతేంద్రకమలాక్షునిఁ గాంచెఁ గృపాకటాక్షునిన్.

220


చ.

కని, యతిభక్తిపూర్వకముగా ధరఁ జాఁగి నమస్కరించి, లే
చి నిలిచిఁ భాలభాగమునఁ జేతులు సరిచి, సమ్మదాశ్రువుల్

  1. శ్రీ విరూపాక్షుని, నానరేంద్రకమలాక్షునిఁ గాంచెఁ-అని వావిళ్ల. 1926