Jump to content

పుట:వదరుబోతు.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

73

బూర్తిసేయ నోచుకొనియె. అష్టదిగ్గజములలో నెల్ల మేటియై యాశుధారా ప్రవీణుఁడగు నల్ల సానివాఁడును నిండుసభలో నొకనాడు తన్ననవర తము పోషించు కృష్ణరాయనివంటి మహాప్రభువు తన కొక్కకృతి యిమ్మని వేడఁగా భాగ్యముపండె నని. కానిమ్మనక,

    “నిరుపహతిస్థలంబు రమణీ ప్రియ
          దూతిక తెచ్చి యిచ్చుక.
     ప్పురవిడె మాత్మకింపయిన
          భోజన ముయ్యెల మంచ మొప్పు తె
     ప్పరయు రసజ్ఞులూహ దెలియం
          గల లేఖక పాఠకోత్తముల్
     దొరికినఁగాక యూరక కృ
          తుల్ రచియింపు మఁటన్న శక్యమే”

యని కేవల ప్రత్యుత్తర మొసంగెను కాని, పట్టుమని పదిపద్యములయిన నారాజుపై చెప్పిన పాపమునం బోలేదు.

'కాని మన కాలమున నిట్లు కాదు. భోజ రాజు దర్శన మక్కఱలేకయే సర్వులును గవులగు చున్నారు. అక్షరలక్షలు లభింపకయే గ్రంథము లసంఖ్యాకములుగ బయలుదేఱుచున్నవి. “చ - దువురాని వానికి సర్వే” యనురీతి నితర విధ జీవ