Jump to content

పుట:వదరుబోతు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

లలో నున్న వారికీని నదేదిక్కు. దానినమ్మినవాఁ డిదివఱకును పెడత్రోవఁ దొక్కలేఁదు.

సంసార సాగరమునఁగూడ సరియైన మార్గ మును జూపుట కిట్టినక్షత్ర మేగలదు. సకలజంతు సంక్షోభకరమై భూమ్యాకాశముల నెల్ల జలమయ- ముజేయు గొప్ప తుపానుచే ధృవనక్షత్ర మగుపడక పోవుట తటస్థించిన సమయమందు గూడ నది స్పష్ట ముగాఁ గానవచ్చుచునే యుండును. ఏమూల నుంచినను ధృవమునే చూపు సూదంటు రాతిముల్లు వలె మనయంతరాత్మ సర్వావస్థలయందును ఆ నక్షత్రము వైపే జూపుచుండును. ఆనక్షత్ర మేది ? దాని పేరు సత్యసంధత. ఇదివఱ కెందఱో దాని నమ్మి కష్టముల దరిఁ జేరియున్నారు. నలహరి శ్చంద్రు లద్దాని సాహాయ్యము లేక యుండినచో, నే దుష్టమార్గమునఁ బడిపోవుచుండిరో, యూ హింపలేము.

అరబ్బీకథలలో నొక వృత్తాంతముగలదు. సిందుబాదనువాఁడు పోవుచుండిన నావ దారితప్పి అయస్కాంతపురాలచేనిండిన గుట్ట యొద్ద పోవలసి వచ్చెను. నావ యింకను కొంతదూరముండగనే దానిలోని యినుు ములుకులన్నియు దానిచే నా కర్షింపఁబడినందున. నావగూడ పర్వతమునకు దగు