Jump to content

పుట:వదరుబోతు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

సుఖమెట్టిది? ఈప్రశ్న కుత్తరము సులభముగాదు. ప్ర- పంచమున సుఖమిట్టిదేయని కాని యది తనసొమ్మే యనికాని నోరువిడిచి చెప్పసాహసించు ధైర్యశాలి మన కంటఁబడఁడు. అయినను జన్మమెత్తిన మీఁద నొకప్పుడైన సుఖమును చవి చూచితినని యను కొనని యభాగ్యుఁడు లేఁడని మాత్రము చెప్ప వచ్చును. కాని యొక్కొకనికది యొకరూపమునఁ దోచుచుండును.

   దధి మధురం మధు మధురం
   ద్రాక్షా మధురా సుధాపి మధు కైవ!
   తస్యత దేనహి మధురం
   యస్య మనో యత్ర సంలగ్నం

అనురీతి నెవని మనను దేనిపైనుండునో, తత్రాప్తియే సుఖమూర్తియని వాఁడు తలపోయు ను. ఇంతియకాదు; నేఁటి సౌఖ్యము రేపటికట్లు తోపదు. కాక, కోటీశ్వరులును రాజాధిరాజులును గూడ ననేకసమయముల నిఱు పేదలకన్న నెక్కుడ సుఖదూరులుగ నుండుటకలదు. మఱి ప్రపంచమున వాస్తవముగ నట్టిపదార్థమే లేదా!

నిన్న సాయంతనమునఁ దటాకపు టొడ్డునఁ గూర్చుండి యీవిషయమై తలపోసి కొనుచుంటిని.