Jump to content

పుట:వదరుబోతు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

ప్రస్తావన.

కడచిన ప్రపంచమహాసంగ్రామము మనువ్యజాతి - దృష్టినే. క్రొత్తత్రోవకుఁ దిప్పినదనుట సుప్రసిద్ధవిషయము. నీతి, మతము, ధర్మము,సంఘము మొదలగువాని దృఢమూలములగు కట్టు దిట్టముల నన్నింటిని కదలించి మన మనోవాక్కాయములను దిక్కుదిక్కులకు పరవశముగాఁ ద్రోసిన పెనుతుపానుగా నాయుద్ధము పరిణమించినది. తీవ్రముగ యోజించు స్వభావముగల యనంతపురపుఁ దరుణులలోని యొకరిద్దఱి హృదయములందా యుద్ధకాలమునఁ గలిగిన కదలిక ఫలమే, యీ 'వదరుబోతు'.

ఇవి రచింపబడి యించుమించుగా పదునైదు వర్షములు గడచినవి.ఈపదునైదు సంవత్సరములలో మన త్రికరణములు నడవడులందుఁ గలిగిన మార్పు అత్యద్భుతము. స్వాతంత్య్రకాంక్ష. యిపుడు శాఖోపశాఖలుగా పుంఖానుపుంఖములుగా పాఁకుచున్నది. కాని యప్పటి సన్నివేశములు వేఱు. ఇప్పటి కాయలును పండ్లును అప్పుడు పిందెలుగానో పూపలుగానో యుండి