Jump to content

పుట:వదరుబోతు.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

వీరు వారనక యండఱను నిజముగా కడుపులు పుండు పుండగునట్లు తుడవఱకు నవ్వించునఁట!

_____________


అనుకరణ విద్య

8

సృష్టి ధర్మముల గుఱించి విపులముగ : నాలోచించితిమేని ప్రాణికోటికిఁ బరానుకరణము స్వభావమనుట స్పష్టముగ గోచరింపకమానదు. ఏవిద్యకైన గురుఁ డవసరమేమోకాని, యగ్ని కుష్ణమును నీటికిశీతమునుబలె నీకళ మనకుఁ బ్రకృతి సిద్ధము. ఇహలోకయాత్రకై సృష్టికర్త మన కొసంగిన పాథేయమిది. తల్లి గర్భము వెలువడి ధరాగర్భము సొచ్చునందాఁక మనమభ్యసించు విద్యలును, నేర్చు నడవడికలును సంపాదించు సాంగత్యములును, ప్ర క టిం చు భావములును, చూపుగుణములును, అన్నియుఁ గొంచెముగనో గొప్పగనో తన్మూలముగనే మన కలవడుచున్న యవి. మనమేవిధముగ నేమినేర్చుకొన్న నేమి యది ప్రకారాంతరముగఁ బరాను కరణమే.ఇతరుల యాశయముల నెఱింగి, వాని ననుకరించుటచేఁ గా కున్న మనము పుట్టినవారు. పుట్టినట్లేయుండి ప్ర-