Jump to content

పుట:వదరుబోతు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

విరామ కాలములందు వారికిఁ గావలసినది నవ్వుట నవ్వించులు, కాని వ్యాసంగముగాదు. మఱియు విద్యకు జ్ఞానముఫలముగాక, పరీక్షలోఁ దేరుట- యును, దానికి జీవితములను గుణకారము చేయుట యును ఫలములుగా నేర్పడుటచే నేడు స్వతంత్ర వ్యాసంగపు వాడుకయే తప్పినది. అందుచే మన మాలోచించునదంతయు భూతభవిష్యత్తుల సం- బంధములేని వర్తమానకాలము. ఇతరులపని చేసి చేసి విసిగి, చేయవలసిన మనపనియేదియుఁ దోఁపక, వేసరియుండు సద్యఃక్షణము సంతోషముగాఁ గడ చినఁజాలును. కాని, నందునిరాజ్య మిదివఱకై నదో యిక ముందు గానున్నదో యనుజోలి పనిలేదు. కావున నిన్నటి పశ్చాత్తాపములును రేపటి భయ ములును మనకంటవు. మనకుఁగావలసినది 'నేటి నవ్వు. ఇది రేపటికీడై పరిణమించినను సరే!

నవ్వువారెందఱున్నారో నవ్వించుమార్గములు నన్ని గలవు. కాని యవి యొండొంటికి మిత్రములు గావు. ఒకరి నవ్వుతో వేఱొకరి నవ్వు సమరసింపదు. వారినవ్వు వీరికిఁగోపము. ఇంకొకరికి రోత. వేఱొ కరికేమియుఁ గాని వెట్టిషని. మరొకరికి విప్పరాని బ్రహ్మముడి. దృష్టాంతమునకు దూరముపోఁబని లేదు.. మా 'వదరుఁబోతు' నామధేయమే చా