Jump to content

పుట:వదరుబోతు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

మూఁడునెలల కేని ప్రతివ్రాయ ననకాశములేదు. అనవసరమున నొకటిపై నొకటి యంగరఖాల దొడిగికొని మెడ "కజాగళ స్తనముల నతికించు కొనుటకును, కాలితిత్తుల బిగించుకొనుటకునే కాల మంతయు వ్యర్థమగుచుండ సద్వ్యాసంగమునకు గాల మెట్లువచ్చును? పరిచితులైననుగాకున్నను, త్రోవ నెదురయిన వారితో నెల్ల నిరర్థక జల్పనలొన రించుచు, 'శాస్త్రులవారి గుఱ్ఱము' వలె నిలువఁబడు పెద్దమనుష్యు లితర కార్యము లెప్పుడు చేయనేర్తురు? తమ కళత్రములు, భవనములు, వాహనములు, ఆరామములు సంపదలునే సర్వోత్తమములనితలం- చి యందఱయెదుట నభివర్ణించుకొను మహనీయుల కన్యులసుఖదుఃఖములరయ విరామమెందువచ్చును? కాలమును బరుగెత్తించుటకై మితిలేని ధనవ్య- యమునేని యోర్చి చీట్లాడుచుఁ గృతార్దులగు వారి కిఁక పొద్దెక్కడిది? - పనిలేని వారి యాశకు నలువది యెనిమిది గంటల దినమైనఁ జాలునా? వీరికోరిక ననుసరించి సృష్టికర్త యట్లే తన కాల చక్రమును మార్చె నను కొందము. ఈయసహ్యాలంకారములు, నీయసంబద్ధ జల్పనములు, నీయప్రస్తుతాత్మస్తుతిప్రసంగములు, నీయనర్ధక వినోదములును స్వేచ్ఛగా, నిరాతంక