Jump to content

పుట:వదరుబోతు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

సేరితిని.

మాటకు ముందు కాలము చాలదనుట మనకిపు డలవాటు. విద్యార్థులకుఁ బాఠములు చదువఁ గాలము లేదు; విద్యావంతుల కితరుల కుపదేశించుట కవకాశము చాలదు; సేవకులకు నియమితమగు పని చేయను బ్రొద్దు తక్కువ; అధికారికిఁ బ్రజల మొఱ లాలకించుటకుఁ దఱి లేదు; ధనవంతున కితరులు కష్టసుఖములు విచారింప వేళ యుండదు; మూఁడు గాళ్ళ ముసలికి “రామా! కృష్ణా" యనుకొనుటకే తీఱిక యొదవదు.

కాని, కాలము చాలదని మనపూర్వు లిన్ని తంటాలు పడుచుండినట్లు వినము. శ్రీరామ చంద్రు నంతటిరా జెట్టియల్పుని విన్నపములైనను సావధానముగ నాలించు చుండెనఁట, ఉపదేశించు వారున్న చో నింకెన్ని ధర్మములు పురాణములు వినుటకైన ధర్మరాజు కాలము చాల దనియుం- డఁడు. ఇదేమి కాని, పదునారు వేల భార్యలతో గాపురము సేయవలసివచ్చినను, శ్రీకృష్ణుఁ డెన్నఁ డును దీఱిక లేదన లేదు.

మఱి సృష్టికర్త మనల మోసగించి నలువది యెనిమిది గంటల దినము నిపు డిరువదినాల్గు గంటల దానిగ మార్చెనా? మార్పు జెందినది.