Jump to content

పుట:వదరుబోతు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

య్యక మనస్సును బ్రశాంతముగా నుంచుకొనుట యోగాభ్యాసపరులగు మహాత్ముల కేగాని కేవల మానవునకు సాధ్యముగాదు.


విశ్రాంతి వేళల వాహ్యాళి వెడలునపుడు నాబుద్ధి యోచనా లహరిలోఁడి మునిగి తేలు చుండునుగాని, యగాధ జలములోఁ బ్రమాద మునఁ బడి కాలుసేతు లిట్లట్లుగదల్చి యాప్రశాంత సలిలముల సంక్షోభింపఁజేయుటచే నీతరానివాఁ డెట్లు దరిఁజేరలేఁడో యట్లే, నాబుద్ధియు దరిగాం- చుటలేదు. మానవుఁడాచరింపవలసిన ధర్మంబులఁ గూర్చియు మనుష్యజన్మ సార్థకతఁ గుఱించియు చింతించుచుండుట నాకెక్కువ యలవాటు. ఏదే నొక కారణమునఁ దనపల్లియవీడి చేరువనున్న ప- ట్టణమునకుఁబోయి, యందుఁ దటాలునఁ దన ప్రక్కఁ బారిపోయిన మోటారు బండిని జూచి దాని చలనమునకుఁ గారణమరయఁ బ్రయత్నించిన మూడుఁడగు పల్లెటూరివాని యోజనలెంతవఱకుఁ కృతార్థతఁ జెందునో మనష్యధర్మంబును గూర్చి చేయు నాతలపోతలుగూడ నంతవఱకే ఫలించినవి. నాపిచ్చియూహలను నేను మానుచుండుట లేదు. ఒక సా యంతనమున నిట్లాలోచించుచుంటిని.