Jump to content

పుట:వదరుబోతు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

125

బరిచర్య సలుపుచున్నవారు దిక్పాలురనియు, గానము సేయుచున్న వారు రంభాద్యప్సరస లనియు విని యానందించితిని. రెండవప్రక్క నున్న దివ్యతరుణ మూర్తులు మహాకవులని యాపురుషుఁ- డు నా కెరిఁగించెను. వారిలో దేవికన్న నున్న తా సనమున నాసీనుండై యున్న మహనీయుడు వల్మీక భవుఁడఁట! అతని నాశ్రయించియున్న వ్యక్తి పారాశర్యుఁడు. కాళిదాస కవితిలకుఁడు దేవికి సమీపమున సమానాసనము నధిష్టించి యుండె. దాపునఁ గూర్చుండి యతనిని సాసూయముగఁ జూచుచున్నవాఁడు భవభూతి. వారికిఁ దరువాత భాస, శూద్రక, శ్రీహర్ష, మాఘ, బాణ, దండి, భారవి, సుబంధు, భోజ, జయదేవ, మురారి విము ఖులగు మహాకవులు యధార్హముగ పీఠముల నలం కరించి యుండిరి.

ఇట్టి మహాను భావులు నిందఱ నొక్క మాఱుగ దర్శించుభాగ్యము సేకూరుట కెంతో సంతసించితిని, గాని యంతలో నా హృదయమున నొక విషాదము జనించెను.. నా కంటఁ బడిన దంతయు గీర్వాణవాగ్జాలమే; గీర్వాణ కవిబ్బం దమే. ఆంధ్రకావ్య మొక్కటేని, ఆంధ్రకవి యొక్కఁడేని వాగ్దేవికడ కానరామి నాకెంతో