Jump to content

పుట:వదరుబోతు.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఇఁక , ఔరంగజేబు కాలము నాటి మన దేశపుస్థితి యొకించుక స్మరింతము. మహత్తరమగు మతాభి మానము గల్గి యన్యమతాసహిష్ణులగు మహమ్మదీయులు. భారత దేశమున పాలక పదవి. నధిష్ఠించి యుండిరి. ఆర్య మతము లన్నియుఁ దమ సనాతన ధర్మములఁ దురుష్కుల పాలు గావించి పేరు పెంపులేకుండ నణగిపోవ సిద్ధముగ నుండినవి. దేవాలయము లన్నియు మసీదులుగ మాఱిపోన సాగెను. భారత మహిళల మానము లెల్ల బజారున విక్రయింపఁబడు చుండె . వేళ మీరక శూర శిరోరత్నము శివాజీ యవతరించి పొంగి పొరలి యార్భటించుచు వచ్చుచున్న మహ మ్మదీయ మతప్రవాహమునకు జెలియలి కట్టయై నిలువంబడి దేశమునుమతమును జాతీయతను సయి తము నిలువంబెట్ట గలిగెను.

మఱియు, ఆంధ్రభాషాయోషామణి యన దయై యున్నపుడు- ఆంధ్రు లాశ్రయ విహీనులై చెల్లా చెదరై యున్న పుడు - ఆంధ్రభూమి సరివారి కన్నులలోఁ జౌకగఁ బరిణమించు స్థితి దాపరించి నపుడు - జనించి, భాషతోడు జనులను దేశమును సముద్ధరించి మానము గాపాడి పేరు నిలువబెట్టిన యా మహామహుడు విజయనగర చక్రవర్తి మూరు