Jump to content

పుట:వదరుబోతు.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83

పెండ్లి పిలుపు

14

ఇయ్యది వివాహ ముహూర్తములు కాలమగుటచే నెల్లవారు నేదోయొక విధముగ నీ శుభకార్య ప్రసంగములలోఁ దగులుటఁ జేసి యితరములగు పనులకుఁ జాల లోటు వాటిల్లినది. వయసు మీఱనున్న తమ పుత్రికా జనమునకు వర గ్రహముల వెదకి ముడివేయుటకై చౌకులలోను యాత్రాస్థలముల యందును, పొగబండి సంధి ప్రదేశముల చెంతను గాచికొని కన్యాజనకులును, వరశుల్కముల బేరములను మధ్యవర్తుల మూలమునఁ బరిష్కరించు కొనుచు నిష్కర్షా పత్రికల వ్రాయించుకొను పనులలో వర జనకులును, శ్రమపడి తిరిగి పొత్తులు కుదిర్చి పౌరోహిత్యముల నార్జించు కొనుటకై పురోహితులును, ఈ బాధ లేమియు లేని కతంబునఁ బిలువని పేరంటములకైన ముందు పడిపోయి కడుపాత్రము దీర్చుకొను కార్యములలో నితరులును, అందఱును మిక్కిలి పాటుపడుచున్నవారు, సంపాదకునకుఁ గూడ నీలో నొక చిన్నికూతురు గల్గుటచే నతఁడుకు నొక చిన్ని వరుని యన్వేషించు ప్రయత్నములో నున్నాఁడు. నా మిత్రులనేకులు కన్యాదాతలుగానో, వరులుగనో,