1080లో నిర్మితమైంది. లండన్ టవర్ ఒక దుర్గంగాను, రాజప్రాసాదంగాను, జైలుగాను చరిత్రపుటలకెక్కింది.
అత్యంత విలువైన 23,578 వజ్రాలు ఇక్కడి మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. అందులో చరిత్ర ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం కూడా ఉండటం గమనార్హం.
ఎందరో యుద్ధ ఖైదీలు దారుణ హింసలకు గురై ఇక్కడ అసువులు బాశారు. ఈ కోటకు వున్న కొన్ని బురుజులు ఆ దారుణ కృత్యాలకు సాక్షులుగా నిలిచివున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో దీనిని యుద్ధ ఖైదీల ఉరితీతకు ఉపయోగించారు. ఇప్పటికి మరణశిక్ష పడ్డ ఖైదీలను ఇక్కడ ఉరి తీస్తారు.
వీరాధివీరులు యుద్ధాలలో ఉపయోగించిన యుద్ధ సామగ్రితోపాటు ఇక్కడ చూడవలసింది ఎంతో ఉంది.
లండన్ టవర్‌ను చూసి, థేమ్స్ నదిలో పడవలో విహరించి, లండన్ అందాలను తిలకించాము.
వర్డ్స్‌వర్త్ నివాస గృహం
రెండువందల సంవత్సరాల క్రితం ప్రఖ్యాత ఆంగ్లకవి విలియం వర్డ్స్‌వర్త్ నివసించిన కుటీరాన్ని అద్భుతంగాను, అతి సుందరంగాను నిర్వహిస్తున్నారు. ఈ కాటేజిలోకి ప్రవేశించిన సందర్శకులు వర్డ్స్‌వర్త్‌తోను, ఆయన కుటుంబీకులు, సన్నిహితులతోను సంభాషించిన, గడపిన అనుభూతిని పొందుతారు. ప్రకృతి ప్రేమికులైన వర్డ్స్‌వర్త్ తన స్నేహితుడు, కవి, స్యామ్యూల్ టేలర్ కోవెరిడ్జ్‌తో కలిసి 1799లో లేక్‌డిస్ట్రిక్ట్‌కు సందర్శనకు వెళ్లాడు. అక్కడి ప్రకృతి సోయగాలను పరవశించిపోయిన వర్డ్స్‌వర్త్ అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఆ క్షణమే భావించాడు. ఆ తరువాత కొన్ని నెలలకే అక్కడ