| సీ, | ముంగురుల్ దువ్వి కనుంగని ముద్దాడి తళుకులేఁజెక్కుటద్దముల నొక్కి | |
| తే. | మఱియుఁ బంచాస్త్రశాస్త్రసమ్మతుల నతుల, గతుల రతులఁ బెనంగి యాకంజముఖిని | 119 |
| సీ. | వితతదంతక్షతావృతసుధాధరయును మానితనిశ్వాసమారుతయును | |
| తే. | గళదహీనమృగీమదకర్దమయును, సదమలానందపరవశసంహననయు | 120 |
| ఉ. | అంత రతాంతవేళ దనుజాంతకుఁ డాచెలి నంకపీఠికన్ | 121 |
| తే. | సురఁటి విసరుచుఁ బల్మఱు సుదతితోడ, సరససల్లాపముఁ బ్రొద్దు జరప నిట్లు | 122 |
| క. | పిదపన్ రుక్మిణి మొదలగు, మదవారణయాన లష్టమహిషులునున్ సొం | 123 |
| తే. | దుష్టజనుల వధించుచు శిష్టజనుల, కభిమతార్థంబు లొనఁగూర్చి యాదరమునఁ | 124 |
| క. | ముదమున నీహరిసత్కథఁ, జదివిన వ్రాసినను విన్న జనులకు సతతా | 125 |
| క. | అని సూతుఁడు మునిజనులకు, వినిపించినరీతి శుకుఁడు వేడ్కఁ బరీక్షి | 126 |
| క. | ఈకృష్ణకథ ముదంబున, నీకరుణ నొనర్చినాఁడ నిఖిలేశ్వర నీ | 127 |
| ఉ. | ఆరయ శాలివాహనశకాబ్దముల ద్రిగుణాంగచంద్రులం | |