పుట:రుక్మాంగదచరిత్రము (ప్రౌఢకవి మల్లన).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నేకాదశీవ్రతం బవనీశ్వరుం డాచరించుటయును దద్వ్రత
నిమిత్తంబున వసుంధర సర్వసంపత్సమృద్ధి నొందుటయు
ధర్మపత్నియైన సంధ్యావళియందు ముకుందచరణారవింద
భక్తితాత్పర్యుండగు ధర్మాంగదుం డుద్భవించుటయు ధరణీ
చక్రంబునంగల మానవలోకంబులో నొక్కండయిన య
మసదనంబునకుఁ జనకుండుటయుఁ దత్పుత్రపౌత్రు లాచరిం
చు వ్రతపుణ్యంబునం జేసి యమలోకంబున మున్నున్న నార
కులు నరకనిర్ముక్తులై దివ్యలోకంబున కరుగుటయు జమస
దనం బఖిలజనశూన్యత్వంబు నొందుటయు నారదుండు
యమునిపురంబునకుం జనుటయు ధర్మరాజు తనలోక
శూన్యవృత్తాంతంబు నారదునకు విన్నవించుటయు నత
నికి నారదుండు రుక్మాంగదుం డొనరించు నేకాదశీవ్రత
ప్రభావం బెఱిఁగించుటయు నతండు కమలగర్భుసమ్ముఖం
బునకుం జన నియోగించి చనుటయు నన్నది ప్రథమా
శ్వాసము.