42
రామాయణ విశేషములు
| విష్ణు పురాణము | క్రీస్తునకు పూర్వము | 1530 | ఏండ్లు |
| ధీరేంద్రనాధపాలు | క్రీస్తునకు పూర్వము | 1520 | ఏండ్లు |
| బంకించంద్ర | " | " | " |
| బాలగంగాధరతిలకు | " | 1400 | " |
| కోల్ర్బూకు | " | " | " |
| విల్సస్ | " | " | " |
| ఎలిఫిన్‌స్టన్ | " | " | " |
| విల్ఫర్డు | " | 1370 | " |
| జకానన్ | " | 1300 | " |
| ఫ్రాట్ | " | 1300 | " |
శ్రీ పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు తాము స్వయముగా “భారతయుద్ధము క్రీస్తునకు పూర్వము 16 శతాబ్దమందు జరిగిన"దని వ్రాసినారు. మోహన్‌జోదారో పరికరాలనుబట్టి పరిశోధకుల అభిప్రాయ ములో ఆర్యుల నాగరికత క్రీ. పూ. 3000 ఏండ్లకు పూర్వమునుండియే వచ్చినదని వ్రాసినది సమంజసముగా కనబడుచున్నది దానినిబట్టి రామాయణము 2500 ప్రాంతములోనిదని ఊహింపవచ్చును. మహాభారత రచనాకాల నిర్ణయము నీ చర్చలో ప్రధానముగా పెట్టుకొనుట అప్రస్తుత మగును. టూకీగా ఇంతమాత్రము చెప్పవచ్చును.
భాగవత, మత్స్య, వాయుపురాణములలో మహాభారత కాలము క్రీస్తునకు పూర్వము 1565 అని నిర్ణయింపబడినది విష్ణుపురాణములో క్రీ. పూ. 1530 అని చూపబడినది. అదంత వ్యత్యాస హేతువు కాదు. ఈ నాలుగు పురాణాలలోని రాజవంశావళి కాలాలను అబద్దమని త్రోసి వేయ వీలులేదు. కావున మహాభారత యుద్ధకాలము క్రీ. పూ. 1565 గా గ్రహింపవచ్చును. రామాయణ కాలములో వింధ్యకు దక్షిణముననుండిన దేశాలు అరణ్య ప్రదేశాలై యుండెను. మహాభారత రచనాకాలమునాటికి