Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 రామాయణ విశేషములు

జనకుడు దశరథుని సాయము వేడ రాముడుపోయి యతని నోడించెను. జనకుడు ప్రీతుడై సీత నిత్తునని మాట యిచ్చెను. తంటాలు తాకట్ల నారదుడుడొకనాడు సీతను చూడవచ్చెను. నారదునిగడ్డము జడలు మున్నగునట్టి భయంకర చిహ్నములజూచి సీత బెదరి యింటిలో దాగు కొనగా నా కలహభోజనుడు సందుదొరకెనని భామండిలుడను రాజునకు సీతను బలాత్కారముగా నెత్తుకొనిపొమ్మని పురికొల్పెను. అతడటుల చేయక తన యొద్ద నుండిన ధనుస్సును జనకునకు బంపి దానిని రాముడెత్తి బాణము సంధింపగలిగెనేని పెండ్లిచేయుమని చెప్పెను. రాముడా ధనుస్సు నవలీలగా నెత్తి సంధించెను. సీతను పెండ్లియాడెను. లక్ష్మణుడు విద్యాధరులలోని పదునెనమండ్రు స్త్రీలను పెండ్లియాడెను. దశరథుడు వృద్ధుడై తన రామునకు రాజ్య మప్పగింపగోర కైకేయి తన వరముల జ్ఞాపకముచేసి రాము నడవికంపెను. సీతారామలక్ష్మణులు అడవిలో తిరిగి తిరిగి చిత్రకూటమును చేరిరి.

సీతాపహరణము 5

అచ్చటినుండి విజయపురమును చేరిరి. అచ్చట నొక సుందరి లక్ష్మణునివరించి యాతనిమెప్పింపలేక యురివేసుకొనదొడగెను. అప్పుడు రాముడు వారిరువురకు పెండ్లి చేసెను. క్షేవాంజలి యనురాజ్యములో జితపద్మయను రాకన్నియను లక్ష్మణుడు పెండ్లియాడెను. రామాదులు పిమ్మట దండకారణ్యమును ప్రవేశించిరి. అచ్చట కూర్పణఖ కుమారుడు శంబూకుడు తపస్సుచేయుచుండ లక్ష్మణుడు చంద్రహాసముతో నతని జంపెను. శూర్పణఖ శ్రీరామునితో మొరపెట్టుకొనబోయి వచ్చినపనిని వదలి యతనిని మోహించెను. మోహము విఫలమయ్యెను. అందుపై ఆమెభర్తయగు ఖరుడు యుద్ధముచేయవచ్చి రామునిచే చచ్చెను. రావణుడు తనచెల్లెలిని తృప్తిపరుపదలచి లక్ష్మణుడు లేనిసమయములో దూరమునుండి లక్ష్మణునివలెనే యార్తనాదము చేసెను. సీత రాముని