Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xLiv

అను నీ గ్రంథరచనము గావించి దీనిమూలమున లోకమునకు మహోపకారము చేసియున్నారు. దీనివలన మనము దెలిసికొనవలసిన విషయము లెన్నియేని కలవు. వారి పునర్ముద్రణ సంస్కరణములు స్వహస్తముననే పూర్తియైయుండినచో నా యీ పీఠికావిశేషములు వారి కలమునుండిమే ఖచితములయ్యెడివేమో! కాని అట్టి యవకాశమును భగవంతుడు మనకు గలుగఁజేయలేదు. సర్వేశ్వరు డా పవిత్రజీవికి శాశ్వతశాంతి విశ్రాంతు లొసంగి తనలో నిమిడ్చుకొనుగాక యని నా యీ యుపోద్ఘాతము నింతటితో విరతము గావించుచున్నాను.


ఇట్లు

జనగామ

అనుముల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

17-10-1956

తెలుగు పండితుడు

ప్రెస్టన్ ఇన్స్‌స్టిట్యూటు

జనగామ