Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

XXXV

లందఱును నిశ్చయించి యున్నారు. ఇందువలన క్రీ. పూ. (320 + 100 + 1500) = 1920 సంవత్సరముల నాటిది భారత యుద్ధకాలము. దానికి 300 సం॥ల పూర్వుడుగా రాముఁడు క్రీ. పూ. 2220 సంవత్సరముల కీవలి వాఁడనుకొన్నను దప్పుగా నుండదు. కాఁబట్టి రామాయణ కథాకాలము నేఁటికి 4176 సంవత్సరముల లోపలి దనుకొందును. ఇందుకు విరుద్ధమైన యే నిర్ణయమైనను నిరాధారము.

రావణుఁడు

ఆఖ్యానములో వీనినిగూర్చి యత్యల్పముగనే చెప్పఁబడియున్నది. ఖర దూషణాదులైన బంధువుల వధను విని క్రోధముచే నొడలు తెలియనివాఁడై రావణుఁడు మాయావియైన మారీచుని సహాయమున రామ లక్ష్మణులను దూరముచేసి సీతనపహరించెనట. కారణము జ్ఞాతివధ జనిత క్రోధముగాని యన్యముగాదట. ఈ సందర్భమున మన యాఖ్యానకారుఁడు “నవిరోధోబలవతా క్షమో రావణ తేనతే”. 'రావణా! బలవంతుడైన రామునితోడి విరోధము నీకు సాధ్యమైనదిగాదు' అని మారీచుడు పెక్కు తెఱఁగుల వారించినను వాఁడు వినలేదని సైతము చెప్పి యున్నాఁడు. హనుమంతుఁడు నూరామడ సముద్రమునుదాఁటి లంకఁ జొచ్చెనని యిందున్నది కదా! ఈ విషయమున నితరాధారము లెట్లున్నవో పరికింతము. అతి ప్రాచీనమని నేఁటి చరిత్రకారు లనేకులచే నిర్ణయింపఁబడిన వాయు పురాణములో భూగోళవర్ణన 16 అధ్యాయములందున్నది. అందు మలయద్వీప వర్ణనానంతరము లంకాద్వీపము,


శ్లో. తథాత్రికూట నిలయే నానాధాతు విభూషితే
    అనేక యోజనోత్సేధే చిత్రసాను దరీగృహే
    తస్యకూట తటేరమ్యే హేమప్రాకార తోరణా
    నిర్వ్యూహవలభిచిత్రా హర్మ్యప్రాసాదమాలినీ
    శతయోజన విస్తీర్ణా త్రింశదాయామ యోజనా