284 రామాయణ విశేషములు అసిరియా పైన ప్రధాన పరిశోధకుడని (Famous assyriologist) పేరు పొందిన సెయన్ (Sayee) గారు హిబ్బర్టు ఉపన్యాసాలలో (1887) ఇట్లన్నారు: "హిందూస్థానమునకు బాబిలోనియాకును క్రీ. పూ. 8000 ఏండ్లనాడు వ్యాపారము జరుగుచుండెను. ఉర్ బగస్ రాజు బాబిలోనియాను రాజ్యముచేసిన కాలములో ఈ వ్యాపారము సాగెను. ఊర నగర ఖననము లలో హిందూదేశపు టేకుకట్టెలు దొరికినవి. బాబిలోనియనులు బట్టలను 'సింధు' అనిరి. ఈపదము జండ్ మాట్లాడు వారిద్వారా వచ్చియుండిన హిందు అయియుండెడిది.” ఈ వాక్యాలను బట్టి ఆర్యులవ్యాప్తి ఎంతటి ప్రాచీనముదో తెలియవచ్చును. ఇంగ్లీషులో గూప్ (Goose) అనునది ఆంగ్లో సాక్ట్లను భాషలో గాస్ (Gois' అని యుండెచు. ప్రాచీన హంగరీ భాషలో దానినే కన్న (Kans) అనిరి. ఇప్పటి జర్మన్ భాషలో గన్స్ (Gans) అందురు. ఆంగ్లోసాక్టన్ భాషలో ఫ, స, ధ (f, s, th) ధ్వనులకు ముందుండు ‘న’ కారధ్వని (n) లోపించును. గాధిక్ లో ముంత్సు అనునదే మూత్ ఆయి మౌత్ (నోరు) అయినది. లాటిన్లోని డెన్స్ (dens) టోత్ అయి, తర్వాత టూత్ అయినది. లాటిEలో ఆన్సర్, సంస్కృతములోని హుస, రష్యనులోని గూస్, బొహీమియ౯లో హస్, ఇంగ్లీషులో గూస్ అయినది ' ఇంగ్లీషులో గూస్ అనిన బాతు. కావున మన పూర్వుల హుసలన్నియు బాతులే! వసిష్ఠుడు విశ్వామిత్రునికి విందుచేసినప్పుడు (బాలకాండ) చెరుకు రసమును కూడా ఇచ్చెను. చెరకులను హిందూ స్థానమునుండి పూర్వము 1. Max Muller & Science of Language, Voi. II, P. 244.
పుట:రామాయణ విశేషములు.pdf/334
స్వరూపం