పరిశిష్టము రామాయణములో నేను చెప్పదలచిన విషయచర్చ ముగిసినది. అచ్చటచ్చట వ్రాయవలసియుండిన కొన్ని విషయములు మరచిపోయి నందున వాటిని కూర్చి పరిశిష్టమను పేరుతో ఈ ప్రకరణములో వేసి పరిసమా ప్తిచేయుచున్నాను. మహాభారతములో ఈ క్రింది శ్లోకము లున్నవని ఒక విమర్శకుడు వ్రాసినాడు. “శ్లోకశ్చాయం పురా గీతో భార్గవేణ మహాత్మనా ఆఖ్యాతే రామచరితే నృపతిం ప్రతి భారత! రాజానం ప్రథమం విందేత్ తతో భార్యా తతో ధనం రాజన్య సతి లో కేస్మిన్ కుతో భార్యా కుతో ధనం." -మ. భా. 7,67,15. ఈ రెండవశ్లోకము రామాయణములో ఎక్కడ నున్నదో ఏమో. పై శ్లోకములో భార్గవుడనగా వాల్మీకి. లంక త్రికూటపర్వతముపై కట్టబడియుండెను. రఘువంశములో త్రికూటము అపరాంతములో నున్నట్లు వర్ణింపబడినది. నాసికవద్ద అంజమేరి అను స్థలమున్నదనియు అచ్చట కొన్ని ప్రాచీన శాసనములు లభించినవనియు అందు పూర్వ త్రికూటవిషయము పేర్కొనబడిన దనియు అందుచేత త్రికూటము నాసిక్ ప్రాంతములోని
పుట:రామాయణ విశేషములు.pdf/331
స్వరూపం