Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

200 రామాయణ విశేషములు 3. రాముడు వనవాసార్థమై చేసిన ప్రయాణములు. 4. సీతాన్వేషణమునకై సుగ్రీవుడు ప్రపంచము యొక్క నాలుగు దిక్కులకు తన వానర సైన్యములను పంపునప్పుడు వర్ణించిన భూభాగములు. ఈ నాలుగున్నూ వాల్మీకియొక్క భూగోళపరిజ్ఞాన మెంతటిదో మనకు తెలుప గలుగుచున్నవి. అందుచేత ఈ నాల్గింటిని వరుసగా విచారింతును. 1. విశ్వామిత్రునితో రామలక్ష్మణులు ప్రయాణమైనప్పుడు అయోధ్యను వదలి సరయూనదిని దాటిరి. తర్వాత సరయువు గంగలో సంగమించు తావును చేరిరి. అదే అంగదేశమని విశ్వామిత్రుడు తెలిపెను. ఆ సంగమ స్థానమున గంగను దాటిన వెంటనే “అవి ప్రహతమును” “ఘోరసంకాశమును” అయిన అరణ్యమును వారు ప్రవేశించిరి. (బా (బాల 24-12). ఇచ్చట గమనింపవలసిన దేమనగా సరయూ సంగమమగు గంగకు దక్షిణతీరమునుండి అరణ్యము ప్రారంభమగుచుండెను. రాముని కాలములో ఆర్యావర్తమున కదొక హద్దుగా కనబడుచున్నది. ఈ విష యము నింతలో చర్చింతును. ఈ యడవిలోనే మలద, కరూశ దేశము లుండెను. వీటిని తాటకియు, ఆమె కొడుకగు మారీచుడును పాలించి జనులను పీడించుచుండిరి. ఈ దేశములను తాటకావనమనియు అనుచుండిరి. దీనిని దాటినతర్వాత సిద్ధాశ్రమమను పేరుగ లది యుండెను. ఆ ప్రాంతమందే పూర్వము బలిచక్రవర్తి రాజ్యము చేసి యుండెనట. ఆ సిద్ధాశ్రమమందే విశ్వామిత్రుడుండెడివాడు. ఇది మొదటి ఘట్టము. విశ్వామిత్రుడు కొంతకాలము తర్వాత రామలక్ష్మణులను మిథిలలోని జనకుని ఆస్థానమునకు పిలుచుకొనిపోవు మార్గమును ఇక విచారింతము.