రామాయణ విశేషములు 185 రామునికి హనుమంతుడు నమ్మినబంటుగా లభించెను. సుగ్రీవుడు మంచి మిత్రుడుగా దొరకెను. అయితే వాలివధ మాత్రము అంతగా సమర్థనీయము కాజాలదు. వాలిని చంపుటకు ముందు అతనికి రాయబార మంపవలసియుండెను. అతని నుండి ఏమి సమాధానము వచ్చెడిదో తెలిసికొనవలసి యుండెను. అటుపై యుద్ధయు ప్రకాశముగా చేయవలసి యుండెను. తెలియకుండా దాగియుండి కు స్త్రీపట్టుచున్న వాలిని బాణముతో వధించుట ఏల? వాలి మరణశయ్యపై సూటిగా పోటుమాటలతో రాముని అధిక్షేపించెను. “నేను నీకపకారము చేయలేదుకదా! యుద్ధము చేయదల చిన ఈలాటి పనియేల? నీ సీతను తెచ్చుటకు సుగ్రీవుడు సాయపడునని చేసితివా? నన్ను అడిగియుండిన అవలీలగా ఆ పనిని సాధించియుందునే? నన్ను అడవిమృగ మని వేటాడితివా? అదైతే కోతులను తినువారి నెందును చూడలేదే! మాంసాపేక్షలేని వేట యెందులకు?" ఈ విధముగా ప్రశ్న పరంపరలను రామునిపై కురిపించెను. రాముడన్నింటికిని సమా ధానమిచ్చెను. అవన్నియు తృప్తికరముగా లేవు. వ్యాఖ్యాతలందేవో పరమ రహస్యపు జాడలను తీసినారు. అవన్నియు బలవంతపు బ్రాహ్మణార్థమువలె కనిపించుచున్నవి వాల్మీకి అట్టి ద్వంద్వార్థాలు వ్రాయునట్టి మాయాకవి కాడు! ఈ భావమును నేనొక్కడనే ప్రకటించిన అపచారము చేసిన వాడ నగుదునేమో! భవభూతి తన మహావీర చరితములో చేసిన మార్పును గమ నించవలెను. చెట్టుచాటునుండి తన కపచార మేమియు చేయని వాలిని బాణముతో కొట్టుట తన కథానాయకుని శౌర్యమునకు లోటని భవభూతి వాలికిని శ్రీరామునికిని ద్వంద్వయుద్ధమును కల్పించెను. అదేవిధముగా ఉదాత్త రాఘవమును రచించిన మూయు రాజక వియు తన నాటకమందు వాలి రాముల ద్వంద్వయుద్ధమును కల్పించెను. ఈ విధముగా ప్రాచీన ప్రామాణిక పండిత కవులును వాలివధా ఘట్టములో న్యూనతను గమ నించియున్నారు._హనుమన్నాటక మను సంస్కృత నాటకములో
పుట:రామాయణ విశేషములు.pdf/235
Appearance