Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 188 మయ్యెను. గొప్ప సామ్రాజ్యమునకు పట్టాభిషేకము చేయుటకై తండ్రి, మంత్రులు, పురోహితులు, నగరవాసులు, పల్లెజనులు, తమ్ములు, తల్లులు అందరునూ హర్షించిరి. కాని కైకేయికి మంథర దుర్బోధలు చేయుటచేత బుద్ధిమారెను. దశరథుడు ఆమెకు రెండువరాలు ఇచ్చియుండెను. వాటిని పాలించవలసివచ్చెను. పట్టాభిషేకము కొన్ని గడియలలో జరుగవలసి యుండెను అప్పుడు రాముడు కైకేయీ దశరథులు సన్నిధికి పిలువ బడెను. తండ్రికి ఆమంగళము పలుకుటకు నోట తడిలేదు. మూర్ఛా వస్థలో నున్నాడు. గట్టి గుండెగల కైకేయి బండుగా రామునితో రాజ్య త్యాగము, వనవాసము చేయవలెనని చెప్పును. పిడుగువంటివార్త. దానిని వినిన ఇతరులందరును గట్టిగా రోదనము చేయుచుండిరి. మరి రాముడో? అభిషేక నుప్పుడు ఆనందమును ప్రకటింపలేదు. ఇప్పుడు కూలబడి వాపోవలేదు. ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం, నచైవ రామః ప్రవివేళ శోకం ప్రవిధ్యతే చాపి మహానుభావో, రాజాతు పుత్రవ్యసనాభిత ప్తః (అయో. 19_41` పైగా వెంటనే యిట్లనెను. ఏవ మస్తు, గమిష్యామి వనం వస్తు మహం త్వితః జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞా మనుపాలయ౯. ఇంతేనా, ఇదిగో ఇప్పుడే అడవికి వెళ్ళుచున్నాను. జడలు దాల్చి రాజునాజ్ఞను పాలించుచున్నాను అని అన్నాడు. మరియు ఇట్లన్నాడు. “ఇంత మాత్రపు కోరికను నాకు తెలిపి యుండరాదా? దీనికై వరములు కోరవలెనా? వనమునకు పోవుటకు సిద్ధముగా నున్నాను కదా!" అనియు నిశ్చింతతో పలికెను.