Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బడినది. రామాయణ విశేషములు 179 ఇదే భావము ఉద్యోగ పర్వమందును ధర్మరాజును గురించి చెప్ప “మనోహి హేతు స్సర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే.” మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః” వేపతే స్మాధికం సీతా విశంతీ వాంగమాత్మనః వనే యూథపరిభ్రష్టా మృగీ కోకై రివార్దితా. సు. 11-41 ఉపనిషద్వాక్యము ప్రావేపత భయోద్విగ్నం సింహం దృష్ట్వావ గోగణః K. 25-5 మహాభారతం భీష్మ. అ. 13 శ్లో. 10 ఇక్కడ సింహమును చూచిన ఆవులు వణకినట్లుగా భీష్మమరణ కాలమందు కౌరవ సైన్యము కంపించెనని వర్ణించినారు. కాని తిక్కన సోమయాజి పూర్తిగా రామాయణ మందలి పై శ్లోకమునే అనుకరించెను. అంగద నాథు మ్రింగిన వృకావలి తన్ వెసజుట్టుకొన్న స ర్వాంగములం జలించి వెగ డందుచు, దిక్కులు సూచుచున్న సా రంగియపోలె నుండె కురురాజ! భవత్సుతుసేన భీష్ము నా జిం గబళించి పాండవులు జృంభితవిక్రమలీలఁ బొల్చుటన్. అసంశయం హరిశ్రేష్ఠ! క్షిప్రం మా ప్రాప్స్యతే పతిః అంతరాత్మా హి మే శుద్ధ సస్మింశ్చ బహవో గుణాః సు. 37 - 12th ఈ భావమును సంపూర్ణముగా కాళిదాసు సంగ్రహించుకొనెను. ఆసంశయం క్షత్రపరిగ్రహక్షమా, యదార్య మస్యా మభిలాషి మే మనః