Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

145

రాజరాజులు, చక్రవర్తులు, నియంతలు, మహాప్రధానులు, ప్రధానసేనానులు, జగద్విఖ్యాత పురుషులు వేలకొలదిగా ఈ కీరో పండితునిచేత తమ సాముద్రిక భవిష్యత్తును చెప్పించుకొని అతడు చెప్పినవన్నియు సత్యమని పూని చెప్పియున్నారు. అట్టి కీరో యీ శాస్త్ర ప్రాచీనతనుగురించి యే వాక్యములను సెలవిచ్చెనో వాటి విలువ అద్వితీయము. వారింకను చాలా సంగతులు హిందువులనుగురించి వ్రాసిరి. అవి యిచ్చట అప్రధాన మగుటచే ఉదాహరించలేదు ఈజిప్టు చరిత్ర క్రీ. పూ. 4000 ఏండ్లనుండి లభించుచున్నది. దాని పేరు, గురుతు, జాడ తెలియరానప్పుడే హిందువులు సాముద్రికమును కనిపెట్టి రనిన రామాయణకాలములో దీని చర్చ యుండుట ఏ మాత్రముస్నూ ఆశ్చర్యము కలిగించనేరదు.

సీతకు పెండ్లి కాకముందే జ్యోతిర్విదులగు బ్రాహ్మణులు ఆమె చేతి రేఖలను పరీక్షించి ఆమెకు వనవాస దుర్యోగమున్నదని చెప్పి