Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 59


శ్రీ. ఓ. మెకటరంగయ్యగారు ఇట్లు తెలుపుచున్నారు: "వాల్మీకి 500 సర్గలు రచింతుననెను. కాని ఇప్పటి షట్కాండములందు 557 సర్గ లున్నవి. ప్రక్షి ప్రములు కొన్ని చోట్ల స్పష్టముగ తెలియును. పూర్వవ్యాఖ్యా తలే బాలకాండలోని మహామైథున సంకల్పము, యుద్ధకాండలోని ఆదిత్య హృదయమును ప్రక్షిప్తములుగ గణించిరి సుందరకాండలో సీత హను మంతునితో చెప్పిన కాకాసుర వృత్తాంతమునకు కొన్ని ప్రతులలో అయోధ్యకాండలో నొక సర్గమంతయు కల్పింపబడినది. యుద్ధకాండ సర్గలు 120,121,122 ప్రక్షిప్తములుగ నగపడుచున్నవి అందు “కృష్ణః ప్రజాపతిః”అని రాముడు స్తుతింపబడినాడు. అది భవిష్యత్కృష్ణావతార సూచనయని గోవిందరాజ వ్యాఖ్య. ప్రక్షిప్తములు విడదీసి వాల్మీకి ప్రోక్తమగు భాగమును మాత్ర మెవ్వరైన నిర్ణయింప గలుగుదురేని గొప్ప భాషా సేవగ నుండును.

4

"కృత్స్నం రామాయణం కావ్య మీదృశైః కరవా ణ్యహం" (బాల. 2-41)

అని రామాయణమంతయు అనుష్టుప్పు శ్లోకాలతో రచించుతున్నా నని వాల్మీకి ప్రవచించెను కదా! తక్కిన శ్లోకాలన్నియు ప్రక్షిప్తా లన వలెనా లేదా? బాలకాండ మొదటి నాలుగు సర్గలలో వాల్మీకి అను మహర్షి రామాయణమును రచించెను అని పలుమారు లితరులు చెప్పినట్లుగా వర్ణించుటచేత ఆ నాలుగు సర్గములును ప్రతి ప్తములే యనిపించును.

+ శ్రీ ఒంగోలు వెంకట రంగయ్య, బి. ఏ., బి ఎల్. గారు (నెల్లూరు) ఈ రామాయణ విశేషములు మొదటి ము దణమును చదివి నాకు విపులముగా 8 జాబులు వ్రాసిరి. వారి పరిశోధక విజ్ఞానము అతి విపులము. వారు నా భావములతో చాలావర శేకీభవించి నాకు మంచి ప్రోత్సాహము కలిగించినారు.