పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరులు. ముసల్మాను ఒత్తిడిని లక్ష్యముచేయకుండా వీలుచూసుకుని స్వతంత్ర ఆధిపత్యము సంపాదించుకున్న రాహూతులు. భాషకు…సంప్రదాయములకు కెేవలం పరాయివాళ్ళయినా ఏలిక అభిరుచులను మరగినభాగ్యాన తెలుగుకవిత్వాన్ని—కవులను, ఆదరించి గ్రంథరచన ప్రోత్సహించారు. రఘునాథుడు—విజయరాఘవుడు—అటు, తిరుమలనాయకుడు—చొక్కనాథుడు…వీరందరూ లేకపోతే తెలుగుతల్లిని ప్రేమతో పూజాస్థానంగా చేసుకోకపోతే…రంగాజీలాటి దివ్యతారలు మెరసిపోకపోతే…ఎంత అంధయుగం—వాఙ్మయచరిత్రలో!…వెలుగు యీనాటికైనా కోలుకొనేదా?

ప్రతాపసింహుడు—రసికప్రభువు—1749 మొదలుకొని పదహారు సంవత్సరాలు పరిపాలనచేసినాడు. ఈతని కుమారుడు…పితామహునిపేరిటివాడు…‘భరతశాస్త్రనిధి: సంగీతం అతనిసొమ్ము: రూపమున మన్మథుడు.’

ఇంకొకరసికుడు—ప్రతాపసింహుడే ఉన్నాడు—అమరేంద్రుని కుమారుడు…

ప్రతాపసింహుడు వైష్ణవుడు. తండ్రినాటినుంచి కులగురువు—తిరుమల తాతయాచార్యుడు—బ్రహ్మవిద్యానిధి.

♦ ♦ ♦ ♦


చోళసింహాసనాధ్యక్షుడైన ఆ మహారాజు వలపునేస్తము—ముద్దుపళని…

—పళని…దక్షిణదేశంలో వేలాయుధుని పూజాక్షేత్రము. ముద్దు—ముత్తు…తమ ముద్దుచెల్లించుకునేందుకు ద్రావిడులు—కన్నపాపలకు ఉంచే నామ—పూర్వపదము. ‘చాలచోట్ల బిడ్డలకు దేవస్థలములపేరులే ఉంచుచుండుట వాడుకఉన్నది’—అని…నిత్యసువాసిని బెంగుళూరి నాగ(గాన)రత్నం గ్రంథస్థము చేసినది.