పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36


ఇట్టి యచ్యుతనాయకునికి మూర్తిమాంబకు రఘునాథ నాయకుడు జన్మించెను. రణము పెండ్లిచవికెగా భావించిన మహావీరుఁడు రఘునాథుఁడు. అతడు పాండ్య, తుండీర, చేర, పారసీక, ఆంధ్ర దేశ రాజుల సందఱనుజయించి, విజయలక్ష్మిని వరించెను. అత డపజయమన నెఱుఁగఁడు, ఈతఁడు రణరంగధీరుఁడై ననుశత్రురాజులు వెనుకనుకుఁ దగ్గినవారిని సంరక్షించి, వెన్నాడక యుండు నుదారుఁడు. ఈతని యేనుగుల శాలలో, వింధ్య సింహళపు టేనుగులు, గుఱ్ఱాలశాలలో, శక, సింధు బాహ్లిక దేశపు గుఱ్ఱములు కోట్ల సంఖ్యకు మించు నవరత్నమయ కాంచనాభరణములు, ప్రకాశించెడివి. నగరిలో మెజపుదీగెలఁ బోలిన మొలతలు, మెలఁ గెడివారు. ఇవియన్నియు శత్రురాజుల కానుకలు, ఈతఁడు జయి: జననీగ లక లెక్క లేదు. వైరిరాజుల శిరస్సులను పాషాణములతో నీతడు కావేరీనది కానకట్ట గట్టినాఁడినవచ్చును. కృతులు మెచ్చఁగ దగినసత్కృతులు. ధరాదేవికి హారములనదగు నగ్రహారములు, సకల దేవాలయ ప్రతిష్ఠలు సర్వవిధములైన దానములను చేసి రఘునాథ నాయకుఁడు రాజ్య మేలెను.

రఘునాథ రాయని భార్య కళావతి, 13మె పరమ పతివ్రత. వారికి, అచ్యుత రామభద్రుఁడని విజయ రాఘవనాయకుఁడని యిరు వురు కుమారులుగలిగిరి. అందు పెద్దవాఁడగు రామభద్రుఁడు మహావీరుఁడు. అతని నిలువెల్ల కరు?. ఆతనిపలుకులు నీతీ ప్రచార ములు. తలపులు ధర్మమునకు పుళ్ల నిండ్లు. " డ లు దాక్షిణ్యసం కేత ములు, ఆతఁడు మన్మథునివంటి సుందరుఁడు, అతనిసోదగుఁడే విజయ రాఘవనాయకుఁడు. ఇతఁడే కృతిభర్త.