ఘ్రి = పాదములయందుఁ గల, నఖము లనెడి చంద్రులయొక్క, ద్యోత = ప్రకాశముచేత, “ప్రకాశోద్యోతఆతపః" అని అ. సిధ్యత్ = సిద్ధింపుచున్న, పరివ్రాట్ = యతీశ్వరులకు, "భిక్షుః పరివ్రాట్కర్మందీ" అని అ. ఆఖండల = ఇంద్రులైన బ్రహ్మర్షులయొక్క, మండలీ = సమూహముయొక్క, 'బింబో స్త్రీమండలం త్రిషు” అని అ. హృదయము లనెడి, జీవంజీవ = చకోరపక్షులయొక్క, “జీవంజీవశ్చకోరకః" అని అ. సంజీవనము గలవాఁడా!
| క. | కారుణ్యవిభవలక్ష్మీ, తారుణ్యసదోపభోగ ధన్యకటాక్షా | 264 |
కారుణ్యవిభవ = దయాతిశయముయొక్క, లక్ష్మీ = సంపద యనెడి, తారుణ్య = యౌవనముయొక్క, సదోపభోగ = నిత్యానుభవముచేత, ధన్యమైన, కటాక్షముగలవాఁడా! కటాక్షమునకుఁ గారుణ్యమె యౌవన మనుట. శారీర = శరీరసంబంధమైన, అర్ధమందు = అర్ధశరీరమం దనుట. సులాలిత యైనగౌరియందు, రారజ్యమాన = మిక్కిలి నాసక్తిగలవాఁ డౌచును, కమ్ర = మనోజ్ఞమైన ఆపేక్ష గలవాఁడా!
| కలహంసవృత్తము. | హిమనగాద్రితన యేక్షణలక్ష్మీ, స్తిమితపుణ్యఫలదేహవిలాసా | 265 |
| గద్యము. | ఇది నిఖలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ పింగళియ | |
| గద్యము. | ఇది శ్రీమన్మదనగోపాలకృపాకటాక్షసంప్రాప్తసారసారస్వతసంపదానంద | |
సంపూర్ణము
చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము.