5. అపక్రమము: ['వాక్యం యత్తు క్రమభ్రష్టమ్.')
6. ఖిన్నము: ['జాత్యాద్యుక్తావనిర్వ్యూఢమ్.')
7. అతిమాత్రము: ['యత్ సర్వలోకాతీతార్థమ్.']
8. పరుషము: ['యత్తుక్రూరార్థమత్యర్థమ్.']
9. విరసము: ['అప్రస్తుతరసంయత్.']
10. హీనోపమ: ['హీనం యత్రోపమానం స్యాత్.']
11. అధికోపమ: ('తదేవయస్మిన్నధికమ్.']
12. అసదృశోపమ: ['యత్త్వతుల్యోపమానమ్.']
13. అప్రసిద్ధోపమ: ['అప్రసిద్ధోపమానం యత్.']
14. నిరలంకారము: ['యదలఙ్కారహీనమ్.']
15. అశ్లీలము: ['అశ్లీలార్థ ప్రతీతికృత్.']
16 విరుద్ధము: 3 విధములు.
1. ప్రత్యక్షవిరుద్ధము.
2. అనుమానవిరుద్ధము
3. ఆగమవిరుద్ధము
ఈమూటిలో నొక్కొకటి 3 తెఱఁగులు; మొత్తము 9.
5. 'పౌర్వాపర్యావిపర్యయః.'
6. 'జాత్యాద్యుక్తావనిర్వ్యూఢమ్.'
7. 'లోకాతీత ఇవార్థో యః.'
8. 'అతిక్రూరస్తు వాక్యార్థః.'
9. 'ఆప్రాకృతరసమ్.'
10. 'హీనం యత్రోపమానం స్యాత్.'
11. 'యత్రోపమాన మధికమ్.'
12. విసదృశోపమ: 'అతుల్య ముపమానం చేత్.'
13. 'అప్రసిద్ధోపమానం చేత్'.
14. 'అలఙ్కారవివర్జితమ్.'
15. 'యదసభ్యార్థసమృద్ధమ్.'
16. విరుద్ధము: 3 విధములు
1. ప్రత్యక్షము.
2. అనుమానము.
3. ఆగమము.
ఈమూటిలో నొక్కొకటి మరల 3 విధములు. మొత్తము 9.
దోషములు, తల్లక్షణములు కేవలము భోజునికృతియందే కాక తత్పూర్వాలంకారికులకృతులలోను గానఁబడుచున్నవి; కావున దోషలక్షణములు, తద్రచనాక్రమమును బ్రాచీనులచే స్థిరరూప మొసఁగఁబడినవి. అందుచే శబ్దసాదృశ్యము రచనాసామ్యము దోషప్రకరణమునఁ దప్పవు. కేవలము నీసామ్యములఁ బట్టియే యొకగ్రంథకర్త మఱకనికృతి నుపజీవ్యముగాఁ గొనెనను సిద్ధాంతము సమజంసము కాదని కొందఱువాదింపవచ్చును. కాని గుణప్రకరణమునందలి సామ్యములం జూచుచో