Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. దండి - ప్రకాశవర్షుఁడు

ప్రకాశవర్షుని కుపజీవ్యగ్రంథములు భోజుని 'సరస్వతీకంఠాభరణ-శృంగారప్రకాశములు.' 'సరస్వతీకంఠాభరణము'న దండి 'కావ్యాదర్శము' నుండియు, భామహుని 'కావ్యాలంకారము' నుండియు శ్లోకములు చాలవఱకును, రాజశేఖరుని 'కావ్యమీమాంస' నుండి కొన్నిశ్లోకములును సంగ్రహింపఁబడినవి. భోజుని యీకృతి మనకవికి నొఱవడి యగుటచే దండి-భామహ-రాజశేఖరుల రచనలకు నీతనిరచనలకు విశేషసామ్యసాదృశ్యములు కానఁబడుటలో వింత లేదు. ప్రకృతము దండి-ప్రకాశవర్షులరచనాసామ్యముల నరయుదము.

(అ) ఈ క్రిందిభాగము లుభయులకృతులలోను గానవచ్చెడిని:—

1.

'సముదాయార్థశూన్యం య త్త దపార్థం ప్రచక్షతే'

—దండి. III. 128; ప్రకాశ. 1. 31.

2.

'ఓజ స్సమాసభూయస్త్వమ్'

—దండి. I. 80. ప్రకాశ. 2. 17.

3.

'యత్రోద్వేగో న ధీమతాం.'

—దండి. II. 51. ప్రకాశ. 2. 62.

4.

'అస్తి కాచి దవస్థా సా సాభిషఙ్గస్య చేతసః
యస్యాం భవే దభిమతా విరుద్ధార్థాపి భారతీ'

—దండి. III. 133. ప్రకాశ. 2. 88.

5.

'ఇహ శిష్టానుశిష్టానాం శిష్టానా మపి సర్వథా
వాచా మేవ ప్రసాదేన లోకయాత్రా ప్రవర్తతే.
ఇద మన్ధం తమః కృత్స్నం జాయేత భువనత్రయమ్
యది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారా న్న దీప్యతే'

—దండి. I. 3, 4. ప్రకాశ. 3. 67-68.

6.

'అనుకమ్పా ద్యతిశయో యది కశ్చి ద్వివక్ష్యతే
న దోషః పునరుక్తో౽పి ప్రత్యుతేయ మలఙ్కృతిః.'

—దండి. III. 137. ప్రకాశ. 2. 55-56.

7.

'క్రీడా గోష్ఠీవినోదేషు తద్జ్ఞై రాకీర్ణమస్త్రణే
పరవ్యామోహనే చాపి సోపయోగాః ప్రహేలికాః.'

—దండి, III. 97. ప్రకాశ. 3. 28.