5 వ పరిచ్ఛేదము. [శృంగారవ్యక్తి]
రసవిచారకమును మనకృతికి 'రసార్ణవ' మనుపేరును సార్థకము చేయునదియు నగు నీపరిచ్ఛేదము బహువిపులముగా నుండియుండును. కాని మనకు 2 పుటలగ్రంథము మాత్రమే లభించినది. ఈ ప్రకరణమునకు 'శృంగారవ్యక్తి' యనుపే రీక్రిందిశ్లోకమునుబట్టి కలిగినది:
శ్లో. | 'ఏ(వం) (రత్యా)దయో భావాః శృఙ్గారవ్యక్తిహేతవః | |
— రసార్ణవ. 5. 17.
ఈశ్లోకము భోజుని 'శృంగారప్రకాశము'న 14 వ ప్రకాశమునందలి యుపసంహారశ్లోకములలో మొదటిది. ఈప్రకాశమునందలి కడపటి యీరెండుశ్లోకములను గూడ ప్రకాశవరుఁడు గ్రహించెను.
శ్లో. | 'జన్మానుబన్ధాతిశయసమ్పర్కానుగమా నితి | |
శ్లో. | య దపి చ గదితం ప్రకర్షగామీ | |
—రసార్ణవ, 5. 18-19.
శృంగారప్రకాశము [13 ప్రకాశము] న విస్తరింపఁబడిన భావముల వివిధావస్థలు — భావోదయము, వికాసము మొదలగునవి — 18 వ శ్లోకమున సూచింపఁబడెను. తరువాతిశ్లోకమున నూతన మగు భోజుని రససిద్ధాంతము కొంతవఱకు సంగ్రహముగాఁ జెప్పఁబడెను. ఈసిద్దాంత మేమన — అభిమానము, శృంగారము నను నామాంతరములు గల 'అహంకారము'నకే రసనామ ముచితము. రత్యాదులగు 49 భావములు ప్రకర్షావస్థ నందినను భావనావస్థయం దుండుటచే నవి రస మనఁ జెల్లవు. రత్యాదిప్రకర్షయే రస మనునది ప్రాచీనసిద్దాంతము. ప్రకర్షయైనను భావమే యని భోజునిమతము. ప్రకర్షావస్థయందున్న యీభావము లన్నియు మనలో ననవరతమును బ్రకాశించునహంకారదీపికను బ్రజ్వలింపఁజేయును ['సప్తర్చిషం ద్యుతిచయా ఇవ వర్ధయన్తి']. ఈయహంకారమే మన మనుభవించునది, విషయాంతరముల