4 వ పరిచ్ఛేదము. [అర్థాలంకారనిర్ణయము.]
అర్థాలంకారములు 28: -
1. జాతి.
2. హేతువు.
3. అహేతువు.
4. సూక్ష్మము.
5. సారము.
6. సమాహితము.
7. భావము.
8. విభావన.
9. అన్యోన్యము.
10. విరోధము.
11. విషమము.
12. సంభవము.
13. ప్రత్యనీకము.
14. వ్యతిరేకము.
15. అసంగతి.
16. లేశము.
17. పరివృత్తి.
18. నిమీలనము.
19. వితర్కము.
20. స్మరణము.
21. భ్రాంతి.
22. అభావము.
23. ఆగమము.
24. ఉపమానము.
25. అనుమానము.
26. ప్రత్యక్షము.
27. సంశయము.
28. అతిశయము.
ఇందు 1, 3, 5, 7, 9, 11-13, 15, 18-26 భామహుని కృతిలో లేవు. భామహుఁడు మఱికొన్నియలంకారములఁ బేర్కొనెను.
1. అర్థాంతరన్యాసము.
2. అనన్వయము.
3. అపహ్నుతి.
4. అప్రస్తుతప్రశంస.
5. ఆక్షేపము.
6. ఆశీస్సు.
7. ఉత్ప్రేక్ష.
8. ఉదాత్తము.
9. ఉపమ.
10. ఉపమేయోపమ.
11. ఊర్జస్వి.
12. తుల్యయోగిత.
13. దీపకము.
14. నిదర్శన.
15. పర్యాయోక్తము.
16. ప్రతివస్తూపమ.
17. ప్రేయస్సు.
18. భావికము.
19. యథాసంఖ్యము.
20. రసవత్తు.
21. రూపకము.
22. విశేషోక్తి
23. వ్యాజస్తుతి.
24. శ్లేష.
25. సమాసోక్తి.
26. సహోక్తి.
27. సంసృష్టి.
28. స్వభావోక్తి.
ఇవి ప్రకాశవర్షునికృతియందు మృగ్యములు. దండి మొత్తము 35 అలంకారములను సోదాహరణముగ వివరించెను. ఇతఁడు పేర్కొనినవానిలోఁ దొమ్మిది రసార్ణవమునను [2, 4, 6, 8, 10, 14, 16, 17,