Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశవర్షుఁడు — రసార్ణవాలంకారము

1. మున్నుడి

రెండుసంవత్సరములక్రిందట నాంధ్రసాహిత్యపరిషత్పత్త్రికలో [సంపు. 23-24. (1934-35.)] ప్రకాశవర్షుని 'రసార్ణవాలంకారము' నాసంపాదకత్వమున వెలువడినది. నేఁటివఱకు దానికిఁ బీఠిక వ్రాసి పుస్తకరూపమున నీకృతిపుష్పమును సహృదయలోకమున కర్పించుటకు యోగములు కూడినవి కావు. పలువురు రసజ్ఞు లీగ్రంథమును బంపుఁ డని పరిషదధికారులకుఁ జాలసారులు వ్రాయుచుండి రని విని దీనియెడఁ బాఠకలోకము చూపుసమాదరణమునకు సంతసించి, గ్రంథకర్తను, దత్ప్రృతికాలాదులను, నీకృతివైశిష్ట్యమును గుఱించినసమాలోచనమును బండితలోకమున కర్పించుచున్నాఁడను.

2. కృతజ్ఞత

ఈకృతిని మొట్టమొదట-మహోపాధ్యాయ-విద్యాభూషణబిరుదాంకితులు చెన్నపురవిశ్వవిద్యాలయసంసృతపండితులునగు వి. వేంకటరామశర్మగా రాంగ్లలిపిలో నుచ్చారణచిహ్నముల (Dia-critical marks) తోడను నుపోద్ఘాతముతోడను కలకత్తానగరమున ఆచార్య నరేంద్రనాథ లా[1] సంపాదకత్వమున వెలువడు 'భారతీయేతిహాస త్రైమాసికపత్రిక'[2]లో నేఁటి కెనిమిదివత్సరములకుఁ బూర్వము (మార్చి-1929 లో] ప్రకటించియున్నారు. ఈకృతి గుణోత్తరముగా నుండుట గాంచి యాంగ్లలిపిలో ముద్రింపఁబడినశ్లోకముల నాంగ్లభాషాభిజ్ఞులే యెంతయో పరిశ్రమ సల్పినఁగాని చదువనేర నప్పు డిఁక నాంగ్లభాషా

  1. Dr. Narendranath Law, M. A., B. L., Ph. D., P. R. S.
  2. 'Indian Historical Quarterly'— Vol. V. No. 1. March, 1929.