పించినట్లు దండి వ్రాసియున్నాఁడు. ‘శ్లాఘ్యై ర్విశ్లేషణై ర్యుక్త ముదారం కైశ్చి దిష్యతే' గుణవివరణమునకుఁ బిమ్మటఁ బ్రథమపరిచ్ఛేదమునఁ బేర్కొనఁబడిన దోషములు నలువదినాలుగింటిలో నొక్క 'విరస' మనునది తక్కఁ దక్కినవి కొన్నియెడల గుణత్వము నొందు నని వివరింపఁబడెను. 'విరస' మిందులోఁ జేరకుండుటకు హేతువు 'కాలవిరోధము'నకు వలె గ్రంథపాతమో లేక కవియే దీనిని నపవాదముగా నెంచియుండెనో చెప్పఁజాలము.
శ్లో. | ‘దోషాణామపి యేషాం స్యా ద్గుణత్వం కారణా త్క్వచిత్ | |
— ప్రకాశ. 2 పరి. 35-36.
దోషములు నలువది యని యిటఁ జెప్పఁబడినది. కాని క్రిందటిపరిచ్ఛేదమున 43 దోషములు వివరింపఁబడి యుండుటచే నిటఁ బూర్వాపరవైషమ్యము గానఁబడుచున్నది.
మొదట-పదదోషముల గుణత్వము, ఆపిమ్మట వాక్యదోషముల గుణత్వము, వాక్యార్థదోషముల గుణత్వము నిట్లు మొదటిపరిచ్ఛేదమునందలి క్రమమే పాటింపఁబడియెను. మొదటిపరిచ్చేదమున గుణములను చెప్పినపిమ్మట - (24-28 శ్లో.)
1. శేషగుణాభావము - శైథిల్యదోషము.
2. సామ్యగుణవిపర్యయము- వైషమ్యదోషము.
8. సౌకుమార్యగుణరాహిత్యము- కఠోరము.
4. అర్థవ్యక్తిహీనత- నేయార్థము.
5. ప్రసాదగుణాభావము- అప్రసన్నము.
6. కాంతిగుణలోపము- అవ్యుత్పన్నత.
7. ప్రౌఢి(ఓజో)గుణవిహీనత- అప్రౌఢి.
8. మాధుర్యలోపము- అనిర్వ్యూఢము.
9. ఔదార్యవిపర్యయము- నిరలంకారము.
10. నిస్సమాధిగుణలోపము- ఋజుమార్గము.
ఇందు నేయార్థము ప్రత్యేకముగా వాక్యదోషముగాను, నిరలంకారము వాక్యార్థదోషముగాను గూడఁ జెప్పఁబడినవి. శ్లేషాదిగుణహీ