పుట:మ ధు క ల శ మ్.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                   28

వారలతోడ నేనును అవంధ్యములై తగు జ్ఞానబీజముల్
కారుస జల్లి సొంతముగ కష్టముజేసితి, పండిసట్టి అం
బార మీదేసుమీ సకియ ! వచ్చితి సచ్చపునీరమట్టు, లా
కారములేని గాలిపలె కన్పడ కేగుదు గుర్తులాఱగన్.

                   29

ఏమిపనో యెఱుంగక మహిం బడితిన్ ప్రవహించుచుంటి నే
భూముల నింకనో జలముపోల్కి ననిష్టమొ ! యిష్టమో సఖీ !
ఈమధువాటికన్ విడిచి యేదెసకో సుడివోదు చౌటి ఱా
సీమల వీచుగాడుపులచే, మది నచ్చిన నచ్చకుండినన్.

                    30

ఇచటికి నన్ను త్రోయునపు డించుక కోరడు నాయభీష్ట. మిం
కెచటికొ యిందునుండి యెడయించెయునప్పుడు చెప్పబోవ, డే
ల చపలతర్క మిట్లు పగలంబడ; ఏమిటి కీప్రగల్భముల్,
రుచిగల శీధుపాత్రను మెఱుంగులవాతెఱ జేర్పుమీ సఖీ !
 

33