పుట:మ ధు క ల శ మ్.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్


                         25

ఇహపరలోకతర్కముల నెంతొ చలంపడి శాస్త్రులున్ గురూ
ద్వహులును పెక్కు రేగిరి. పదంపడి వారిభవిష్యదర్థసం
గ్రహమును త్రుప్పువట్టె, సుడిగాలికి బోయె తదీయబోధనా
మహిమయు, దుమ్ముగొట్టికాని మాసెను వారి సమాధులున్ చెలీ!

                       26

ఆవేదాంతుల శుష్క తర్కముల వ్యాఖ్యానింపగనిమ్ము, నీ
వీవృద్ధున్ సుఖపెట్ట రమ్ము సకియా! యేకాంతపున్ సేవ; ఏ
పూవుల్ విచ్చు శుభప్రభాతముల నాపూలన్నియున్ రాలు సం
ధ్యా వేళన్, నిజ మిద్ది: తక్కినది మిథ్యావాద మింకేటికిన్,

                       27

నేనును బాల్యమం దధికనిష్ఠమెయిన్ గురుపాదసన్నిధిన్
మానుగ నాలకించితి ప్రమాణములై న పరేంగితార్థముల్
కాని; నిజాన కెప్పుడును కన్నులు విప్పక బైట పచ్చితిన్
పూనిక వీడి, లోపలికి పోయిన వాకిటనే సఖీమణీ |

31