పుట:మ ధు క ల శ మ్.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్



                       13

మనమొగసాల విచ్చు సుకుమారిగులాబిని చూడు మిట్లు ప
ల్కును సఖి ! 'నవ్వుచున్ వసుధకుం జని. త్రెంచెదనందు నాదు చ
క్కనివరహాలసంచులమొగాల బిగించిన పట్టుత్రాళ్ళు, ప
చ్చనిపువుతోటలోన వెదజల్లుదు నాయరణంపుభాగ్యముల్',


                       14

జను లతికాంక్షతో వలచు జంగమభోగము లొక్క వేళ పం
డిన తెగబండవచ్చు, నవనిన్ బడి యెండిన నెండవచ్చు. మో
హనశిశిర ప్రభాతసమయంబుల శుష్కవనీముఖస్థలిన్
మినుకుమెఱుంగు లీనవె నిమేషము రాలు తుషారబిందువుల్.

                      15

సన్నపసిండి సస్యమును సంతనచేసిన భాగ్యవంతు, లా
కన్నెకడానివిత్తనము గాలికి జల్లెడు భోగమూర్తులున్
మన్నయిపోదు ; రింతె తుది మాఱరు బంగరుధూళి గాగ, ఆ
సన్నులుగారుసూ ప్రజలుసైతము వారల త్రవ్వియెత్తగన్.

23