ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దేశభక్తి
దేశమును ప్రేమించు మన్నా,
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టి పెట్టోయ్,
గట్టిమేల్ తల పెట్టవోయ్ .
పొడి వంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్;
తిండి కలిగితె కండకలదోయ్ !
కండ కలవాడేను మనిషోయ్ !
యీసురోమని మనుషులుంటే
దేశ, మేగతి బాగుపడునోయ్?
జల్దుకొని కళ లెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్.
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ , .
దేశి సరకుల నమ్మవలె నోయ్ !
డబ్బు తేలే నట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్.
వెనక చూసిన కార్య మేమోయ్ !
మంచి గతమున కొంచె మేనోయ్
మందగించక ముందు అడుగేయ్
'వెనుక పడితే 'వెనకె నోయ్ !
'పూను స్పర్ధను విద్య లందే.
వైరములు వాణిజ్య మందే,
52