పుట:ముకుందవిలాసము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

115

   గమలాంబకాధీనకలనఁ దత్సన్నిధి
               వెలయు నెక్కుడులీల వేడ్కఁ గనుట
   హరిపేరు వహియించి యారీతి నవనిలో
               విఖ్యాతిఁ గాంచినవిధముఁ గనుట
   విష్ణుపదావృత్తి విహరింపుచును సాధు
               సుముఖరక్తి నెసంగు శుభముఁ గనుట
   సతత మారామధామసంగతినిఁ గనుట
   సతత మా రామ నామసంస్మృతినిఁ గనుట
   నెలమి మా కాప్తతరులలో నెన్ననైతి .
   వీవు మిక్కిలి శుకసంతతీంద్ర! వింటె!194

క. నీ సత్పథసంచారత
    నీ సకలాగమశిఖార్థనీయఫలవిలా
    సాసక్తి నీకె తగునౌ
    భూసురలోకాభిముఖ్యముగ శుకముఖ్యా !195

    చిలుకలు లేవె! యీవిధి విచిత్రరుచిం దగియున్నె యుండె(బో
    చెలువుగ మర్త్యభాషలు వచించున కొన్ని వచించేఁబో మితో
    క్తుల ననుఁగాక యుక్తు లనఁదోచునె తోచెనుఁబో నినుంబలెం
    దెలివి నపూర్వవస్తువులఁ దెల్పునె యో శుకలోకశేఖరా!196

    మును నినుఁ గని వెఱగందెడు
    మనసున కత్యద్భుతముగ మగువ చెలువముం
    గనుఁగొనినయట్ల యనఁగా
    నొనఁగూర్చితి ప్రియ మొనర్చితో శుకతిలకా !197

    అని మఱియు మురియుచుం దమిఁ
    బెనిచిన వచనముల శౌరి ప్రియ మంగనపై